Alekhya Chitti Pickles : ముగ్గురు అక్కాచెల్లెళ్లు, పచ్చడి వ్యాపారం, వివాదం… చివరకు మూత ఎందుకు?
పచ్చడికి రుచి ఉంది… కానీ మాటలకి మాత్రం విషం!
Alekhya Chitti Pickles అనే పేరుతో పాపులర్ అయిన ముగ్గురు అక్కచెల్లెళ్లు — చిట్టి, అలేఖ్య, రమ్య — ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుఎన్సర్లు, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు లోనవుతున్నారు. పెద్ద ఫాలోవింగ్‌తో Insta & WhatsApp & Youtube లాంటి ప్లాట్‌ఫాంలలో హవా చూపించిన ఈ ముగ్గురు సోదరీమణులు, తింటే మరిచిపోలేని రుచి అని ప్రచారం చేసిన నాన్ వెజ్ పికిల్స్ వ్యాపారం మొదలుపెట్టారు.
రొయ్యల పచ్చడి కిలో రూ.3000? ఖరీదు పై షాకైన కస్టమర్లు😱😱
వాళ్ల పికిల్స్‌కి పేరున్నా, వాటి ధరలు చూసి చాలా మంది కస్టమర్లు షాక్ అయ్యారు. ముఖ్యంగా రూ.3,000 కిలోకి రొయ్యల పచ్చడి అన్న వార్త వైరల్ అయ్యింది. ఒక కస్టమర్, ఈ ధర వెనుక ఏముంది? స్పెషాలిటీ ఏంటి? అని వాట్సాప్ ఛానెల్‌లో ప్రశ్నించాడు. కానీ ఇదే వారి వ్యాపారానికి కీలక మలుపుగా మారింది.
❌కస్టమర్ ప్రశ్నకు బదులు… అసభ్య వ్యాఖ్యలు?
ఈ ప్రశ్నపై అలేఖ్య & సోదరీమణులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నించిన కస్టమర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, “నీ పెళ్లికి బంగారం కొనగలవా?”, “చీరలు కొనగలవా?”, “ముందుగా డబ్బు సంపాదించుకోవడం నేర్చుకో”, వంటి బూతు భాషలో వ్యాఖ్యలు చేశారు. వాటిని ఆఫిషియల్ ఛానెల్ నుంచే పోస్ట్ చేయడం నెటిజన్లను షాక్‌కి గురి చేసింది.

🔊ఆడియో లీక్ – సోషల్ మీడియాలో వైరల్🫨🫨
ఆగ్రహించిన కస్టమర్, అలేఖ్య యొక్క వాయిస్ నోటు ను లీక్ చేశాడు. దీంతో మీమ్ పేజీలు, సోషల్ మీడియా యూజర్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా వైరల్ చేశారు. వ్యాపారం పై నెగటివ్ ఇంపాక్ట్ వచ్చి, పికిల్స్ ఆర్డర్లు తీసుకోవడం ఆపేశారు.
🚫 వెబ్‌సైట్, ఫోన్ నంబర్లు — అన్నీ బంద్
ప్రస్తుతం Alekhya Chitti Pickles వెబ్‌సైట్ పనిచేయడం లేదు. ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్. వాట్సాప్ ఛానెల్ సైతం పాస్ív్ అయ్యింది. వ్యాపారాన్ని సీరియస్‌గా తీసుకుని బ్రాండ్‌గా తీసుకెళ్లే ఛాన్స్ ఉండగా, ఒక వాయిస్ క్లిప్, అహంకార మాటలు, వ్యవహార శైలి** అన్నీ కలసి ఈ బ్రాండ్‌ను క్లోజ్ చేసే దిశగా నడిపించాయి.
బిజినెస్ అంటే కస్టమర్‌కి సమాధానం ఇవ్వడం, గౌరవించటం. ధర పై ప్రశ్నించిన కస్టమర్‌ను తిడితే, అది బ్రాండ్‌కు దెబ్బే. చివరకు నోటిదూలతోనే విజయవంతమైన వ్యాపారం మూసేసుకున్న వీరి కథ… ఒక పాఠంగా నిలిచింది
ఇలాంటి మరిన్ని సోషల్ మీడియా వ్యాపార ట్రెండ్‌ల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి!
Follow Us:
Twitter
Instragram
Facebook
website: www.tollywoodnewsraja.com