Allu Arjun Visits Pawan Kalyan’s Home After Son’s Accident తాత్కాలిక విభేదాలు గాలికి – బంధం మాత్రం గుండెకు!

0
Spread the love

మెగా ఫ్యామిలీ & అల్లు ఫ్యామిలీ… తెలుగు సినీ పరిశ్రమలో అగ్రగాములు. వారిద్దరూ కలిసి ఒక వేదికపై కనిపిస్తే అభిమానులకు పండుగే. అయితే ఇటీవల రాజకీయంగా వేరు వేరు దారుల్లో నడిచిన వీరు, జనాల్లో అనేక ఊహాగానాలకు కారణమయ్యారు.

pawan

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బలంగా నడిపిస్తున్న సమయంలో, అల్లు అర్జున్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోయినా, ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా తన స్నేహితుడు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడంతో, బన్నీ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడమే కాక, బహిరంగ సభల్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది.

ఈ రాజకీయ భిన్నతల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య సంబంధాలు బలహీనపడాయా? అనే ప్రశ్నలు జనంలో గట్టిగా వినిపించాయి. కుటుంబ వేడుకలైనా, ప్రైవేట్ ఈవెంట్లైనా వీరిద్దరూ కలసి కనిపించకపోవడం వల్ల ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

అయితే… తాజాగా జరిగిన ఓ ఘటనలో అసలు బంధం ఎంత బలంగా ఉంటుందో మరోసారి చూపించింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఒక నిప్పుట్ల ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ వార్త విన్న వెంటనే అల్లు అర్జున్ అతని ఇంటికి వెళ్లి కుమారుని ఆరోగ్యాన్ని తెలుసుకున్నారు. పవన్‌తో ఆప్యాయంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులను ధైర్యపర్చారు.

ఈ సంఘటన రాజకీయ విభేదాలు ఎంత తాత్కాలికమో, కానీ బంధం ఎంత శాశ్వతమో గుర్తుచేసింది. ఒకరిపై ఒకరు ఆధారపడిన ఈ కుటుంబాలు విభేదాలు ఉన్నా, బాధలో మాత్రం కలిసిపోతారు అనే విషయం స్పష్టమవుతోంది.

ఈ సందర్భాన్ని పక్కనపెట్టి, గుంటనక్కలాగా రెచ్చగొట్టే వారు మాత్రం తలదాచుకోవాల్సిందే. బంధాల బంధం ముందు చలికాచుకునే వారి కుయ్యోస్ ఎక్కువ రోజులు నిలబడదు. రాజకీయాలు, అభిప్రాయాల భిన్నతలుండొచ్చు… కానీ బంధం, ప్రేమ, స్నేహం ముందు వాటన్నింటికీ విలువ తక్కువే.

ఈ సంఘటనతో మెగా – అల్లు కుటుంబాల మధ్య నిజమైన అనుబంధం ప్రజల్లోకి స్పష్టమైంది. అభిమానులూ ఇదే కోరుకుంటున్నారు – వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ ఒక్కటే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *