పవన్ కళ్యాణ్ మాస్ రిటర్న్– ‘ఓజి’ రిలీజ్ అప్డేట్!

ఫైనల్ గేమ్ మొదలైంది – ‘ఓజి’తో పవన్ మ్యానియా రీ ఎంట్రీ
పవన్ కళ్యాణ్ ప్రస్తుతంగా చేస్తున్న సినిమాల్లో అభిమానుల్లో అత్యంత ఆసక్తి రేపుతోన్న చిత్రం ‘ఓజి’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో, డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి క్రేజ్‌లోనే ఉంది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, టీజర్లు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఒక్క promotional cutతోనే సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌కి మిలియన్ డాలర్ ప్రశ్న. నిన్న జరిగిన నిర్మాతల సమావేశంలో పవన్ ఈ సినిమా కోసం త్వరగా డేట్స్ కేటాయిస్తానని, షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్‌కి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ‘ఓజి’ని సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ని మే నెలలో రిలీజ్ చేయాలని సిద్ధమవుతున్నారు.
కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ఇంకా చాలానే డేట్స్ అవసరం. అందువల్ల అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. నిన్న జరిగిన సమావేశంలో ఈ సినిమా తన చివరి సినిమా అవుతుందనేది పవన్ చెప్పిన మాటలతో అభిమానుల్లో మిశ్రమ భావాలు నెలకొన్నాయి.
ఓజి కోసం వెయిటింగ్ వేయించడమే కాదు… ఓ బ్లాక్‌బస్టర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది!
Follow Us:
Twitter
Instragram
Facebook
website: www.tollywoodnewsraja.com