PEDDI Movie Glimpse Review : రామ్ చరణ్ మాస్ అవతార్ దుమ్మురేపిన రోజు!
పెద్ది గ్లింప్స్ రివ్యూ : 4/5
ఇటీవలి కాలంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లింప్స్ విడుదల అయ్యింది – రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా గ్లింప్స్! బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ డ్రామా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు అధికారికంగా విడుదల కాగా, అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో విభిన్నమైన మైలురాయిగా నిలవనుందని స్పష్టమవుతుంది. ఈసారి ఆయన మరింత రఫ్ లుక్‌తో, మట్టివాసన ఉన్న పల్లెటూరి నేపథ్యంలో కామన్ మాన్ పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌లోని ఒక్క డైలాగ్ — “అనుకున్నపుడే చేసేయాలి, భూమ్మీద ఉన్నపుడే చేసేయాలి… మళ్లీ జన్మ ఉంటుందా?” — ద్వారా హీరో ఐడియాలజీ స్పష్టమవుతుంది. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన ఈ డైలాగ్‌తో రామ్ చరణ్ న్యాచురల్ యాక్టింగ్‌కు మరో మెట్టు ఎక్కారు.

సినిమా నేపథ్యం క్రికెట్ తో ముడిపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది ఓ ఆటగాడి జయాపజయాలు కాదేమో — ఒక సామాన్యుడి పోరాటం, ఆశలు, విలువల కథ అన్నమాట. ఈ కాంబినేషన్‌కు ఇది ఫస్ట్ మూవీ అయినా, గ్లింప్స్ చూస్తేనే బుచ్చిబాబు కథపై వేసిన గ్రిప్ స్పష్టంగా తెలుస్తోంది. “ఉప్పెన” ద్వారా తనదైన మార్క్ చూపించిన బుచ్చిబాబు, ఇప్పుడు చరణ్ వంటి స్టార్‌తో మళ్ళీ కథా లోతులను చూపించబోతున్నట్టు గ్లింప్స్ చెబుతోంది.
గ్లింప్స్ మొత్తానికీ గ్రిప్ ఇచ్చింది స్కోర్. మణిశర్మ తన కుమారుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నట్టు టాక్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌లో మాస్ హై పవర్ ని అందించింది
Release Date:
సినిమా రిలీజ్ డేట్: 2026 మార్చి 27 అని అధికారికంగా ప్రకటించారు. అదే వారం నాని “పారడైజ్” కూడా విడుదల కాబోతోంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బరిలో దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద హీట్ పెరగనుంది.
చరణ్ లుక్, డైలాగ్ డెలివరీ, బుచ్చిబాబు రాసిన పల్లెటూరి రఫ్ టచ్ స్క్రీన్‌పై మాంచి నైజాన్ని తీసుకొస్తున్నాయి. యాస నుంచి యాటిట్యూడ్ దాకా చరణ్ పాత్రను రియలిస్టిక్‌గా తీర్చిదిద్దారు.
అందరూ ఊహించినట్టుగానే “పెద్ది” మాస్, రఫ్, రూట్ లెవల్ డ్రామా అనిపించిస్తోంది. ఇప్పుడు గ్లింప్స్ చూశాక, థియేటర్లో ఈ ఎమోషనల్ క్రికెట్ డ్రామా ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ మొదలైంది.
Follow Us:
Twitter
Instragram
Facebook
website: www.tollywoodnewsraja.com